సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం
ABN, Publish Date - Nov 28 , 2026 | 03:58 PM
సైబరాబాద్‌లోని సైబర్ టవర్స్ పరిసరాల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్, నవంబర్ 28: సైబరాబాద్‌లోని సైబర్ టవర్స్ పరిసరాల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన నల్లటి పొగ కమ్ముకోవడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. మంటలు, పొగతో ఐటీ కారిడార్ ఉక్కిరిబిక్కిరైన పరిస్థితి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Updated at - Nov 28 , 2026 | 04:04 PM