జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ నేతల ఆందోళన
ABN, Publish Date - Jan 23 , 2026 | 01:15 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు పెద్దఎత్తున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, జనవరి 23: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR) సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్ద బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలివచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంతమంది బీఆర్‌ఎస్ నేతలు ఠాణాలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. స్టేషన్ పరిసరాల్లో ఉన్న గులాబీ శ్రేణులను ఎప్పటికప్పుడు పంపివేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఏ అక్రమాలకు పాల్పడలేదు.. మానసిక క్షోభకు గురిచేశారు: కేటీఆర్
సిట్ ముందుకు కేటీఆర్.. ఆ విషయాలపైనే విచారణ
Read Latest Telangana News And Telugu News
Updated at - Jan 23 , 2026 | 01:33 PM