బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో చోరీ..
ABN, Publish Date - Jun 23 , 2026 | 08:49 AM
బాసరలో కొలువుదీరిన జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో భారీ చోరీ జరిగింది. మొదటి అంతస్తులోని మహంకాళి అమ్మవారి ఆలయంలో తలుపు తాళాలు దొంగలు పగలకొట్టారు. అమ్మవారి వెండి కిరీటంతోపాటు హుండీని దొంగిలించారు.
బాసరలో కొలువుదీరిన జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో భారీ చోరీ జరిగింది. మొదటి అంతస్తులోని మహంకాళి అమ్మవారి ఆలయంలో తలుపు తాళాలు దొంగలు పగలకొట్టారు. అమ్మవారి వెండి కిరీటంతోపాటు హుండీని దొంగిలించారు. మంగళవారం తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం చేసేందుకు దేవాలయంలోకి పురోహితులు వెళ్లారు. అమ్మవారి ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని వారు గుర్తించారు అనంతరం దేవస్థానం అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated at - Jun 23 , 2026 | 08:58 AM