రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు.. ఆడుదాం ఆంధ్రాలో భారీ స్కాం

ABN, Publish Date - Apr 08 , 2026 | 12:41 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగిన అవినీతి ఆటపై ఏపీ ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారుల నివేదిక చేరింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలం పాటు సమగ్ర విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు అవినీతిలో అప్పటి క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగిన అవినీతి ఆటపై ఏపీ ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారుల నివేదిక చేరింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలం పాటు సమగ్ర విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు అవినీతిలో అప్పటి క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు. వీరిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. వీరితో పాటు శాప్ ఇన్‌చార్జి ఎండీ హర్షవర్దన్‌పైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సూచించారు.

Updated at - Apr 08 , 2026 | 12:42 PM