‘మేడం రిజల్ట్స్ మనదే’

ABN, Publish Date - May 04 , 2026 | 11:24 AM

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీనివాసుడిని నటి త్రిష దర్శించుకున్నారు. ఈరోజు(సోమవారం) తన పుట్టినరోజు సందర్భంగా తెల్లవారుజామునే శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

తిరుమల, మే 4: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీనివాసుడిని నటి త్రిష దర్శించుకున్నారు. ఈరోజు(సోమవారం) తన పుట్టినరోజు సందర్భంగా తెల్లవారుజామునే శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో త్రిషకు పండితులు ఆశీర్వచనాలు అందించారు. తమిళనాడు ఫలితాల రోజే త్రిష శ్రీవారిని దర్శించుకోవడం.. దర్శనానంతరం బయటకు వస్తున్న నటితో ‘మేడం రిజల్ట్స్ మనదే’ అంటూ అభిమానులు చెప్పడం.. అందుకు త్రిష చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated at - May 04 , 2026 | 11:31 AM