చెట్టినాడ్ వెజిటబుల్ బిర్యానీ.. తయారు చేసుకోండిలా..
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:03 PM
కావలసిన పదార్థాలు: బియ్యం- కప్పు, క్యారెట్, ఆలూ ముక్కలు- అర కప్పు, బీన్స్- పొడుగ్గా కత్తిరించినవి అర కప్పు, చిన్న ఉల్లిపాయలు - 12
కావలసిన పదార్థాలు: బియ్యం- కప్పు, క్యారెట్, ఆలూ ముక్కలు- అర కప్పు, బీన్స్- పొడుగ్గా కత్తిరించినవి అర కప్పు, చిన్న ఉల్లిపాయలు - 12, టమాటా ముక్కలు - అర కప్పు, అల్లం, వెల్లుల్లి ముక్కలు - కొన్ని, పుదీనా ఆకులు - పావు కప్పు, బిర్యానీ ఆకు - ఒకటి, కారం - స్పూను, ధనియాల పొడి - స్పూను, నెయ్యి - స్పూను, జీడిపప్పు పలుకులు - పావు కప్పు, లవంగాలు - రెండు, యాలకులు - రెండు, దాల్చిన చెక్క - ఒకటి, మిరియాలు - స్పూను, సోంఫు గింజలు - స్పూను, మొగ్గ - ఒకటి, ఉప్పు, నీళ్లు - తగినంత.
తయారుచేసే విధానం: ముందుగా అన్ని సుగంధ ద్రవ్యాలని ఓ నిమిషం పాటు వేయించి గ్రైండర్‌లో వేసి మసాలా పొడి చేసుకోవాలి. ఓ పాన్‌లో కాస్త నెయ్యి వేసి అల్లం, వెల్లుల్లి, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. ఉల్లి రంగు మారగానే టమాటాలు కూడా వేయాలి. టమాటాలు మెత్తబడ్డాక మిగతా కూరగాయల ముక్కలూ కలపాలి. అలాగే బిర్యానీ మసాలా, కారం, ధనియాల పొడి, బియ్యం జతచేసి అన్నీ బాగా కలపాలి. ఉప్పు, పుదీనా ఆకులూ, రెండు గ్లాసుల నీళ్లు వేసి మొత్తం కలిపి మూత పెట్టాలి. రెండు విజిల్స్ తరవాత మంట తగ్గించి, మరో మూడు నిమిషాల పాటు వేడి చేసి స్టవ్ కట్టేయాలి. ప్రెజర్ తగ్గాక మూత తీసి, కాసేపు ఆరబెట్టాలి. నెయ్యిలో జీడిపప్పును వేయించి బిర్యానీలో వేసి మొత్తం కలిపితే చెట్టినాడ్ వెజ్ బిర్యానీ సిద్ధం.
ఈ వార్తలు కూడా చదవండి:
అదే నిజమైతే.. మాకు పిల్లలుండేవారు
Read Latest Telangana News and National News