Share News

రూ.100 కోట్ల అక్రమాస్తులు.. పౌరసరఫరాల శాఖ డీఎం అరెస్ట్

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:29 AM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మహబూబాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం వాసంశెట్టి నరసింహరావును అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం తెల్లవారుజామున ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా.. ఆయనకు రిమాండ్ విధించింది.

రూ.100 కోట్ల అక్రమాస్తులు.. పౌరసరఫరాల శాఖ డీఎం అరెస్ట్

వరంగల్, అక్టోబర్ 10: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మహబూబాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం వాసంశెట్టి నరసింహరావును అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం తెల్లవారుజామున ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా.. ఆయనకు రిమాండ్ విధించింది. ఖమ్మంలో ఆయన నివాసంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని అతడి బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఏసీబీ అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆయన వద్ద రూ.100 కోట్లకుపైగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. అవన్నీ బినామీల పేరిట కూడబెట్టినట్లు గుర్తించారు.


ఈ సోదాల్లో ఖమ్మంలో రెండు విలాసవంతమైన భవనాలు, నాలుగు మద్యం బాటిల్స్, రూ.19 వేలతో పాటు బంగారాన్ని అధికారులు గుర్తించారు. తొలుత పౌరసరఫరాల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్‌గా నరసింహరావు విధుల్లో చేరారు. అనంతరం ఆయన డీఎం స్థాయికి ఎదిగారు. కేవలం 15 ఏళ్ల సర్వీస్‌లో ఆయన ఇంతగా సంపాదించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. గతంలో పని చేసిన ప్రదేశాల్లో ఆయనపై భారీగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో రెండు సార్లు ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి.. ఈ దాడులు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తరతరాల జ్ఞాపకాల వారధి పెత్తర అమావాస్య

కాజీపేట మీదుగా దసరా స్పెషల్‌ రైళ్లు

Updated Date - Oct 10 , 2026 | 12:02 PM