Share News

ప్రైవేటు వ్యక్తులతో కలిసి సీఎం రేవంత్ భూములు దోచుకుంటున్నారు: ఎంపీ ఈటల

ABN , Publish Date - Apr 04 , 2026 | 03:16 PM

తెలంగాణ ఎన్నికల వేళ ఆరు గ్యారంటీలు- 66 హామీల పేరుతో ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహించారు. రాష్ట్ర ప్రజానీకం గంపెడు ఆశలతో కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారన్నారు. కానీ, చట్ట సభల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వ్యక్తిగత దూషణలతో కాలం వృథా చేశారని మండిపడ్డారు.

ప్రైవేటు వ్యక్తులతో కలిసి సీఎం రేవంత్ భూములు దోచుకుంటున్నారు: ఎంపీ ఈటల
MP Eatala Rajender

వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారెంటీలు, ఫీజురీయింబర్స్‌మెంట్ సహా పలు అంశాలపై సీఎంకు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ ప్రజల సంపదను రేవంత్ రెడ్డి కొళ్లగొడుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపణలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజల సంపదను తరలిస్తున్నారని మండిపడ్డారు.


తెలంగాణ ఎన్నికల వేళ ఆరు గ్యారంటీలు- 66 హామీల పేరుతో ప్రజలను ఆయన మోసం చేశారని ఎంపీ ఈటల ఆగ్రహించారు. రాష్ట్ర ప్రజానీకం గంపెడు ఆశలతో కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడితే.. చట్ట సభల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వ్యక్తిగత దూషణలతో కాలం వృథా చేశారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 నుంచి ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేసిందని ధ్వజమెత్తారు. పేద విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి సర్కార్ చెలగాటం ఆడుతోందని ఆగ్రహించారు ఈటల.


రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలు ఎలా సాధ్యమవుతుందని ఎన్నికల వేళ అగినప్పుడు.. తాను చేసి చూపిస్తానని రేవంత్ ప్రగల్భాలు పలికారని చెప్పారు. ఇప్పుడు హామీలు అమలు చేయకుండానే చేసినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. వేల కోట్ల విలువ చేసే భూములను ప్రైవేట్ వ్యక్తులతో కలిసి సీఎం రేవంత్ అమ్ముకుంటున్నారంటూ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

కవల ఆడపిల్లలను చంపేసిన కసాయి తండ్రి

‘పోలీస్ మామలు’ అంటూ వాట్సాప్ గ్రూప్.. ఎస్ఐ ఎంట్రీతో సభ్యులు షాక్..

Updated Date - Apr 04 , 2026 | 03:26 PM