Share News

కవల ఆడపిల్లలను చంపేసిన కసాయి తండ్రి

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:48 PM

కవల ఆడపిల్లలను కన్నతండ్రే దారుణంగా హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీశైలం అనే వ్యక్తి తన ఇద్దరు బిడ్డలను బావిలో పడే చంపేశాడు.

కవల ఆడపిల్లలను చంపేసిన కసాయి తండ్రి
Karimnagar Crime News

కరీంనగర్, ఏప్రిల్ 4: జూబ్లీనగర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్న బిడ్డలను కడతేర్చాడు కసాయి తండ్రి. శ్రీశైలం అనే వ్యక్తి తన ఇద్దరు కవల కూతుళ్లు గీతానిషి, గీతాన్వికలను బావిలో పడేసి చంపేశాడు. ఏబీఎన్‌తో తల్లి మాట్లాడుతూ.. పుట్టినప్పటి నుంచే బిడ్డలను తండ్రి హింసించే వాడని ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రి ఇంటికి వస్తే.. బిడ్డలు భయంతో దాక్కునే వారని విలపించింది తల్లి.


ఓ చిన్నారిని బావిలోపల పైపుకు కట్టి హింసించి హత్య చేసినట్లు సమాచారం. అభం శుభం తెలియని చిన్నారులను ఈ విధంగా చంపడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీశైలంను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. చిన్నారులను చూస్తే బాధేస్తోందని ఏబీఎన్‌తో సీఐ అన్నారు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బావి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కవల ఆడపిల్లలను కన్న తండ్రే హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.


ఇవి కూడా చదవండి...

క్యాతనపల్లి ఎన్నిక సజావుగా జరిగేలా చూడండి: బాల్క సుమన్

సీఐడీ ముందుకు పాడి కౌశిక్ రెడ్డి.. విచారణ ప్రారంభం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 04 , 2026 | 01:01 PM