దారుణం.. కాబోయే భార్యను హతమార్చిన యువకుడు
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:57 AM
వారం రోజుల్లో పెళ్లి ఉందనగా కాబోయే భార్యను హత్య చేశాడో యువకుడు. అజ్మీరా అరవింద్ అనే వ్యక్తికి భూక్యా సంగీతతో ఈనెల 29న పెళ్లి నిశ్చయించారు పెద్దలు.
మహబూబాబాద్, ఏప్రిల్ 25: మరిపెడ మండలం గిరిపురం గ్రామ శివారులో దారుణం జరిగింది. అనుమానంతో ఓ యువకుడు తనకు కాబోయే భార్యను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల్లో పెళ్లి ఉండగా ఈ దారుణానికి పాల్పడ్డాడు. అజ్మీరా అరవింద్ అనే వ్యక్తికి భూక్యా సంగీతతో పెళ్లి నిశ్చయించారు పెద్దలు. ఈనెల 29న వీరిరువురికీ వివాహం జరగాల్సి ఉంది.
అయితే.. ఆ యువతి వేరే వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుందన్న అనుమానంతో అజ్మారీ అరవింద్.. ఆమెను బావిలోకి తోసి చంపేశాడు. ఆ తర్వాత దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ నెల 21న రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే.. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. అరవిందే ఆమెను హతమార్చినట్టు అంగీకరించాడు. వారం రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి.. కాబోయే భర్త చేతిలోనే దారుణ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది.
ఇవి కూడా చదవండి...
ఆ కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా: కవిత
పాంచజన్యం పేరుతో హామీలను ప్రకటించిన కవిత
Read Latest Telangana News And Telugu News