Share News

పాంచజన్యం పేరుతో హామీలను ప్రకటించిన కవిత

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:20 AM

టీఆర్‌ఎస్ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన కల్వకుంట్ల కవిత.. ప్రజలకు ఐదు హామీలు ఇచ్చారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.

పాంచజన్యం పేరుతో హామీలను ప్రకటించిన కవిత
Kalvakuntla Kavitha

హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కవిత.. ప్రజలకు పలు కీలక హామీలు ఇచ్చారు. మునీరాబాద్ సభలో కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాను ఐదు ప్రధాన అంశాలపై ప్రత్యేకంగా కృషి చేస్తానని కవిత ప్రకటించారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. మరో రెండేళ్ల తర్వాత ‘మీ అమ్మ ప్రభుత్వం’ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి పాలన అందిస్తామని కవిత హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తామని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న మూడు ప్రధాన పార్టీలు.. అవినీతి, కుటుంబ పాలన, అధర్మంతో నిండిపోయాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘నేను మీ అమ్మను.. తల్లి జేబు చూడదు, కడుపు చూస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. దళితబంధు పథకంపై స్పందించిన కవిత.. ఒక్క ఉపఎన్నిక కోసమే దళితబంధు అమలు చేశారని ఆరోపణలు గుప్పించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రతి అమరవీరుడి కుటుంబానికి కోటి రూపాయలు సాయం అందిస్తామన్నారు. ఆడబిడ్డల భద్రతపై ప్రధాన అంశంగా పనిచేస్తామని కవిత స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో పెట్రోల్‌ బంకుల మూసివేతపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆ కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా: కవిత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 25 , 2026 | 11:34 AM