పెద్దాపూర్‌లో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
ABN , Publish Date - Mar 13 , 2026 | 02:17 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్దాపూర్ గ్రామంలో భార్యను గొడ్డలితో నరికి చంపాడు ఓ భర్త. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త తన భార్యను గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. గణపురం మండలం లోని పెద్దాపూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. సమాచారం ప్రకారం, గ్రామానికి చెందిన సమ్మయ్య అనే వ్యక్తి తన భార్య సంధ్యపై గొడ్డలితో దాడి చేశాడు. భార్య తనకు మందు పెడుతుందనే అనుమానంతో సమ్మయ్య ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. భర్త దాడిలో సంధ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
కాగా, గత మూడు నెలలుగా సంధ్య తన పుట్టింట్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. బంధువుల ఇంట్లో చనిపోయారని చెప్పి ఆమెను ఇంటికి పిలిపించుకున్న సమ్మయ్య, అనంతరం గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన తర్వాత నిందితుడు సమ్మయ్య స్వయంగా వెళ్లి వెంకటాపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read:
ప్రకృతి సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.. ఆ రైతుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
విద్యార్థులకు నాణ్యతలేని భోజనం.. మంత్రి లోకేశ్ ఆగ్రహం
For More Latest News