Share News

ఊరి పండగ వచ్చేసింది!

ABN , Publish Date - Feb 07 , 2026 | 10:38 AM

ఊరి పండగ వచ్చేసింది..! బాలయేసు పుణ్యక్షేత్రం వార్షిక మహోత్సవాలు.. ఈ పేరుతో జరుపుకొంటారు. తొమ్మిది రోజుల పాటు ప్రార్థనలతో కమ్మగూడ ప్రాంతం ఆధ్యాత్మికతతో పులకించనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది క్రైస్తవులు, మతపెద్దలు తరలిరానున్నారు.

ఊరి పండగ వచ్చేసింది!

  • కమ్మగూడ బాలయేసు మహోత్సవం

  • తొమ్మిది రోజులు ప్రత్యేక ప్రార్థనలు

  • వేలాదిగా తరలిరానున్న భక్తులు

ఊరి పండగ వచ్చేసింది..! బాలయేసు పుణ్యక్షేత్రం వార్షిక మహోత్సవాలు.. ఈ పేరుతో జరుపుకొంటారు. తొమ్మిది రోజుల పాటు ప్రార్థనలతో కమ్మగూడ ప్రాంతం ఆధ్యాత్మికతతో పులకించనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది క్రైస్తవులు, మతపెద్దలు తరలిరానున్నారు. వారి రాకతో ఈ ప్రాంతం జనసంద్రం కానుంది. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో బాలయేసును ఆరాధిస్తారు. తమ జీవితాల్లో వెలుగు నింపాలని, సుఖసంతోషాలతో వర్థిల్లాలని వేడుకోనున్నారు. క్రీస్తు ఆరాధనల్లో మునిగితేలనున్నారు. ఇప్పటికే చర్చి కమిటీ నిర్వాహకులు అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ప్రార్థనలతో ముందస్తు మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి రెండవ ఆదివారం ఊరి పండగ పేరిట స్థానికులు ఉత్సవాలు జరుపుకొంటారు. వీరికి శని, ఆదివారాలు ప్రత్యేకం.. ఆ మేరకు కథనం..

(ఆంధ్రజ్యోతి, హైదరాబాద్)

చర్చిని విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. ప్రధానంగా దేవమాత గృహతో పాటు క్రీస్తు జీవిత వృత్తాంతాన్ని తెలిపే దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పవిత్ర భూమిలో ఏర్పాటు చేసిన మేరి మాత మందిరం, కలవారికొండ, ప్రతిమలు అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నాయి. శని, ఆదివారం రెండు రోజుల పాటు బాలయేసు ఉత్సవాలు వైభవంగా జరుపుకొంటారు.


పండగ రోజు..

బాలయేసు మహోత్సవం ఆదివారం తెల్లవారుజాము ప్రారంభం అవుతుంది. తెలుగులో దివ్య బలిపూజ 4 గంటలకు ఫాదర్‌ గోవిందు ఆరోగ్యస్వామి, 5 గంటలకు ఫాదర్‌ బోనగిరి బాల ఆంథోనీ నిర్వహిస్తారు. కాగా, ఉదయం 6 గంటలకు బోయిగూడ నుంచి బాలయేసు తేరు ప్రదక్షిణ ఆరంభం అవుతుంది. ఈ సందర్భంగా చర్చి ఫాదర్‌తో పాటు కమిటీ సభ్యులు తేరుకు స్వాగతం పలుకుతారు. ఇంగ్లీష్‏లో దివ్యబలిపూజ... ఉదయం 9.30 చర్చి విచారణ గురువు తాతిరెడ్డి జయరాజ్‌రెడ్డి, 11.30 గంటలకు తెలుగులో ఫాదర్‌ సిరిల్‌ చేస్తారు.


city5.2.jpgఇదొక ప్రత్యేక క్షేత్రం..

1920లో కమ్మగూడలో బాలయేసు పుణ్యక్షేత్రాన్ని నిర్మించారు. 1977లో అప్పటి అగ్రపీఠాధిపతి స్వామినేని అరులప్ప ప్రారంభించగా, 1979లో మొదటి సారిగా ఉత్సవాలను నిర్వహించారు. అప్పటి నుంచి ఫిబ్రవరి రెండవ ఆదివారం ఊరి పండుగగా భావించి ఘనంగా జరుపుకొంటున్నారు. చర్చికి ఇరువైపుల దవళ వర్ణంలో 100 అడుగుల ఎత్తులో రెండు గాలి గోపురాలు, 150 కిలోల కంచుగంట ప్రత్యేకం.


దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రైస్తవ మత పెద్దలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి మత గురువులు హాజరై బాలయేసును దర్శించుకుంటారు. స్వస్థతా ప్రార్థనలు చేస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి.

కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి వార్నింగ్

ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం

Read Latest Telangana News and National News

Updated Date - Feb 07 , 2026 | 10:38 AM