Share News

వికారాబాద్ పెట్రోల్ దాడి ఘటనలో తీవ్ర విషాదం.. ఒకరి మృతి

ABN , Publish Date - Mar 29 , 2026 | 07:55 AM

ఆస్తి తగాదాలు ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. కన్న తండ్రి, పినతల్లి అనే కనికరం లేకుండా సొంత కుటుంబంపైనే పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉదంతంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు.

వికారాబాద్ పెట్రోల్ దాడి ఘటనలో తీవ్ర విషాదం.. ఒకరి మృతి
Vikarabad Petrol Attack

వికారాబాద్, మార్చి 29: ఆస్తి తగాదాలు ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. కన్న తండ్రి, పినతల్లి అనే కనికరం లేకుండా సొంత కుటుంబంపైనే పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉదంతంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్‌సింగ్ తండాలో చోటు చేసుకున్న పెట్రోల్ దాడి ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.


పగిరి మండలం రూప్‌సింగ్ తండా సర్పంచ్ రమణి బాయ్ నివాసంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సమాచారం ప్రకారం.. ఆస్తి వివాదాల నేపథ్యంలో అమర్ సింగ్ అనే వ్యక్తి తన తండ్రి, పినతల్లి(సర్పంచ్ రమణిబాయ్) కుటుంబంపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సర్పంచ్ పెద్ద కుమారుడు వెంకటేశ్, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంటల్లో కాలిపోయిన రమణి బాయ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.


Also Read:

ఆ ఇళ్లను కొత్త వారికి ఇస్తాం: మంత్రి పొంగులేటి

తెలంగాణ అసెంబ్లీలో డబుల్ బెడ్ రూం ఇళ్లపై చర్చ.. ఎవరేమన్నారంటే..

For More Latest News

Updated Date - Mar 29 , 2026 | 08:21 AM