ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణం మరింత సులభం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ABN , Publish Date - Oct 03 , 2026 | 01:24 PM
హైదరాబాద్ ప్రజా రవాణాలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణికులు ఒకే పాస్‌తో రెండు రవాణా సేవలను వినియోగించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, అక్టోబర్ 3: ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్‌తో నగర ప్రయాణం మరింత సులభంగా మారుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ఆయన బృందంతో కలిసి కామన్ పాస్ ద్వారా ప్రయాణించి.. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. మెట్రోలో ప్రయాణించిన అనంతరం ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకునేలా ఒకే పాస్ విధానం అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు సమయం, శ్రమ ఆదా అవుతుందని తెలిపారు. మెట్రో దిగిన తర్వాత బస్సు కోసం ప్రయాణికులు ఇక అయోమయానికి గురికావాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.
ఇంటి నుంచి గమ్యస్థానం వరకు ప్రజలకు సులభమైన.. సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క తెలిపారు. మెట్రో ప్రయాణికులకు చివరి గమ్యస్థానం వరకూ చేరుకునేలా ఆర్టీసీ బస్సులను తొలి కనెక్టివిటీగా మరింత విస్తరిస్తామని చెప్పారు. భవిష్యత్‌లో మెట్రో, ఆర్టీసీతో పాటు ఆటోలు, ఊబర్ వంటి సేవలను కూడా అనుసంధానించే దిశగా ఆలోచిస్తున్నామని, ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ని బలోపేతం చేస్తామని వెల్లడించారు. ప్రజా రవాణా వ్యవస్థను సమగ్రంగా అనుసంధానం చేసేందుకు తీసుకొచ్చిన కామన్ పాస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు భట్టి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
హనుమాన్ చాలీసా చదివి ధైర్యం తెచ్చుకున్నా..
చంపేస్తున్న ‘సెకండ్ స్మోకింగ్’
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..