రైళ్లలో మత్తుమందు కలిపిన నీటితో చోరీలు.. ఇద్దరు నిందితుల అరెస్ట్
ABN , Publish Date - Aug 29 , 2026 | 05:31 PM
రైళ్లలో ప్రయాణికులను మత్తులోకి దించి చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టైంది. మత్తుమందు కలిపిన నీటితో ప్రయాణికుడిని మాయ చేసి లగేజీ దోచుకున్న ఇద్దరు నిందితులను సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 29: నగరంలో రైలు ప్రయాణికులను టార్గెట్ చేసి మత్తుమందు కలిపిన నీటిని ఇచ్చి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బత్త ప్రసాద్‌రెడ్డి (39), కొరపాటి నర్సింహారావు (44)లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఒప్పో సెల్‌ఫోన్, 10 మత్తు మాత్రలు, రూ.35,400 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 17న శబరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న అనిల్‌కుమార్‌తో నిందితులు మాటలు కలిపి.. మత్తుమందు కలిపిన నీటిని ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు మత్తులోకి వెళ్లిన అనంతరం అతడి లగేజీ బ్యాగ్‌ను అపహరించినట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ జీఆర్పీ ప్రత్యేక బృందాలు వారిని పట్టుకున్నాయి. రైళ్లలో ప్రయాణించే సమయంలో అపరిచితులు ఇచ్చే ఆహారం.. పానీయాలను స్వీకరించవద్దని రైల్వే పోలీసులు ప్రయాణికులను హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవల్లో అంతరాయం
ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్
Read Latest Telangana News And Telugu News