TGSRTC: ఫుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ టూర్ ప్యాకేజీలు
ABN , Publish Date - Jan 20 , 2026 | 07:26 AM
టీజీఎస్ఆర్టీసీ.. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజ్‌లతో స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. బీహెచ్‌ఈఎల్ డిపో నుంచి సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను నడుపుతోంది.ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- 23న కొల్హాపూర్ యాత్ర
హైదరాబాద్ సిటీ: పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజ్‌లతో స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. ఈనెల 23న కోల్హాపూర్, ఫిబ్రవరి 6న గోవా యాత్రలను నిర్వహిస్తోంది. వీటినేకాక తెలుగు రాష్ట్రాల్లోని కాళేశ్వరం, మేడారం, శ్రీశైలం, తమిళనాడు(Kaleshwaram, Medaram, Srisailam, Tamil Nadu)లోని అరుణాచలం, కంచి వంటి ప్రాంతాలకు సెలవురోజుల్లో బీహెచ్‌ఈఎల్ డిపో నుంచి సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను నడుపుతోంది.

ఈనెల 23న బీహెచ్‌ఈఎల్ డిపో నుంచి బయలుదేరి గానుగాపూర్, పండరీపూర్, కోల్హాపూర్, తుల్జాపూర్ ప్రాంతాలను చుట్టివచ్చేలా రూ. 3 వేల చార్జీతో (1నైట్, 2 డేస్)ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఇతర వివరాలకు కోసం 9391072283, 9063401072 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. అలాగే గ్రేటర్‌జోన్‌లోని పలు డిపోల నుంచి మేడారం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వివరించారు.
వచ్చేనెల 6న గోవా..
ఫిబ్రవరి 6వ తేదీన గోవా యాత్ర పేరుతో (3నైట్స్, 4డేస్) నగరం నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసును నడుపుతుంది. ఒక్కొక్కరికి రూ.3,500 చార్జీతో హంపి, గోవా, తుల్జాపూర్‌ను చుట్టివచ్చేలా ప్యాకేజీని రూపొందించారు. ఇతర వివరాలకు 9391072283, 9063401072 నంబర్లలో సంప్రదించవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..
ఏపీలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి
Read Latest Telangana News and National News