Share News

తెలంగాణలో టీవీ అవార్డులపై మంత్రి కోమటిరెడ్డి కీలక భేటీ

ABN , Publish Date - Jul 28 , 2026 | 03:29 PM

తెలంగాణలో టీవీ అవార్డులకు శ్రీకారం చుట్టేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. అవార్డుల పేరు, లోగో, కేటగిరీలపై కమిటీతో కీలకంగా చర్చించారు.

తెలంగాణలో టీవీ అవార్డులపై మంత్రి కోమటిరెడ్డి కీలక భేటీ
Telangana TV Awards

హైదరాబాద్, జులై 28: తెలంగాణలో టీవీ అవార్డులకు శ్రీకారం చుట్టేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. అవార్డులకు పేరు, లోగో, కేటగిరీలకు సంబంధించిన అంశాలపై టెలివిజన్ అవార్డు కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. అవార్డులకు ప్రత్యేక లోగో, పేరు, వివిధ కేటగిరీల రూపకల్పనపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా అవార్డుల పేరు, లోగో ఉండాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం టెలివిజన్ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు.


టీవీ అవార్డులకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అవార్డుల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరగా సిద్ధం చేయాలని టెలివిజన్ అవార్డు కమిటీకి మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

తుంగభద్రలో పూడికతీతపై ఉప కమిటీ

బైబ్యాక్‌, ప్రీ లాంచ్‌ ప్లాట్ల పేరుతో మోసం

Updated Date - Jul 28 , 2026 | 03:48 PM