తెలంగాణలో టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంపై మంత్రి దామోదర సమీక్ష
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:38 PM
తెలంగాణలో ప్రభుత్వం వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సీఎం రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది.
హైదరాబాద్, నవంబరు 28: తెలంగాణ రాష్ట్రంలో వైద్య సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా సీఎం రేవంత్ సర్కార్ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, ఇతర వైద్య మౌలిక సదుపాయాల నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్అండ్‌బీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల ఎంత వరకు పూర్తయ్యాయనే అంశంపై ఆరా తీశారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణం, విద్యార్థుల వసతి గృహాల ఏర్పాటు, జనరల్ ఆసుపత్రుల నిర్మాణ పనుల పురోగతిపైనా మంత్రి అధికారులతో చర్చించారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి, నిర్మాణాల పురోగతిపై నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయడంలో ఈ మౌలిక సదుపాయాలు కీలకమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిర్మాణ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ హల్‌చల్
పూలే దంపతుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
Read Latest Telangana News