Share News

తెలంగాణలో విద్యుత్ కోతలు ఉండొద్దు.. భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 16 , 2026 | 08:41 PM

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో విద్యుత్ కోతలు ఉండొద్దు.. భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు
Telangana Power Supply

హైదరాబాద్, నవంబరు 16: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రబీ సీజన్‌లో రైతులు, ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని, ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

అక్టోబర్ 16న రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 20,018 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందని, వరుసగా రెండో రోజు కూడా 20,003 మెగావాట్ల డిమాండ్ వచ్చినట్లు తెలిపారు. గతేడాది నవంబర్ 16న 8,522 మెగావాట్లుగా ఉన్న డిమాండ్ ఈ ఏడాది 12,802 మెగావాట్లకు పెరిగిందన్నారు. చారిత్రాత్మక స్థాయిలో డిమాండ్ పెరిగినప్పటికీ సమర్థంగా విద్యుత్ సరఫరా చేసిన అధికారులను అభినందించారు.


వర్షాభావ పరిస్థితుల కారణంగా జలవిద్యుత్ ఉత్పత్తిలో 4,000 మెగావాట్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా ప్రణాళికలు సిద్ధం చేయాలని, అవసరమైన విద్యుత్‌ను ముందుగానే సమకూర్చుకోవాలని ఆదేశించారు. దావూద్‌ఖాన్‌గూడ, బడంగ్‌పేటలో కొత్తగా రెండు 33/11 కేవీ సబ్‌స్టేషన్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. విద్యుత్ డిమాండ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులు, ప్రజలు విద్యుత్ కోతల సమస్యను ఎదుర్కోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Updated Date - Nov 16 , 2026 | 08:47 PM