Share News

తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ABN , Publish Date - May 27 , 2026 | 09:35 PM

తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని.. రైతులు ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy

హైదరాబాద్, మే 27: తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని.. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు కూడా పాల్గొని, రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను, వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసినప్పటికీ రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే వర్షానికి తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తక్షణమే బాయిల్డ్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.


ప్రస్తుత రబీలో రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో భాగంగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ కొనుగోళ్ల ద్వారా రాష్ట్రంలోని 8.15 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని, ఇందుకుగాను రూ. 10,097 కోట్ల చెల్లింపులను కూడా ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందని స్పష్టం చేశారు. రైతులు తమ పంటను అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ధాన్యం రవాణా వేగవంతం చేసేందుకు అవసరమైతే ఇసుక లారీలను కూడా ధాన్యం రవాణాకు మళ్లించాలని అధికారులను ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

విజన్ పాలిటిక్స్‌కు టీడీపీ నాంది.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 27 , 2026 | 09:58 PM