అందుబాటులోకి ఫ్యామిలీ సర్టిఫికెట్ సేవ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన
ABN , Publish Date - Jul 31 , 2026 | 06:33 PM
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కుటుంబ సభ్యుల పూర్తి వివరాలతో కూడిన ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను ఇకపై తహశీల్దార్ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల ద్వారా పొందవచ్చు.
హైదరాబాద్, జులై 31: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియ ప్రారంభమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇకపై కుటుంబ సభ్యుల సమాచారం.. వారి పూర్తి వివరాలతో కూడిన ఫ్యామిలీ ధ్రువపత్రాలను తహశీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా పొందవచ్చని తెలిపారు. కుటుంబ వివరాలను అధికారికంగా ధ్రువీకరించుకునేందుకు ఈ సర్టిఫికెట్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ కుటుంబ సమాచారానికి సంబంధించి అవసరమైన సందర్భాల్లో ఈ ధ్రువపత్రాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు.
ఫ్యామిలీ సర్టిఫికెట్ అన్ని చోట్ల చెల్లుబాటు అవుతుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, వివిధ అధికారిక అవసరాలు, కుటుంబ వివరాలను సమర్పించాల్సిన సందర్భాల్లో ఈ ధ్రువపత్రం కీలకంగా మారనుందని తెలిపారు. ఇప్పటివరకు కుటుంబ వివరాల ధ్రువీకరణ కోసం ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడంతో పాటు, ప్రజలకు సులభంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించారు. తహశీల్దార్ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మార్కెట్‌లో నకిలీ ఎరువులు విక్రయాలు.. రైతులకు వ్యవసాయ శాఖ బిగ్ అలర్ట్
నకిలీ నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం.. క్రిమినల్ కేసులు నమోదు
Read Latest TG News And Telugu News