Share News

రూ.కోట్ల బాండ్లు ఎలా వచ్చాయి?

ABN , Publish Date - Jan 24 , 2026 | 05:16 AM

బీఆర్‌ఎ్‌సకు కోట్లాది రూపాయల ఎలక్టోరల్‌ బాండ్లు ఎలా వచ్చాయి? పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్‌ చేసి.. వారి కాల్‌ రికార్డుల ఆధారంగా బెదిరించి పార్టీకి బాండ్లు వచ్చేలా చేశారా? ఎన్నికల సమయంలో వార్‌రూమ్స్‌ పేరిట అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ ఎందుకు చేశారు.....

రూ.కోట్ల బాండ్లు ఎలా వచ్చాయి?
KTR

  • ఫోన్లు ట్యాపింగ్‌ చేసి బెదిరించారా?

  • కేటీఆర్‌ను ప్రశ్నించిన సిట్‌ అధికారులు

  • ట్యాపింగ్‌ జాబితా, బీఆర్‌ఎ్‌సకు వచ్చిన

  • ఎలక్టోరల్‌ బాండ్లను ముందు పెట్టి ప్రశ్నలు

  • సంధ్య కన్వెన్షన్‌ యజమాని శ్రీధర్‌రావు సహా పలువురి వాంగ్మూలాల ప్రస్తావన

  • వార్‌రూమ్స్‌ పేరిట అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ ఎందుకు చేశారు?

  • అది నేరమవుతుందని తెలియదా?

  • మీ సన్నిహితుల ఫోన్లూ ట్యాపింగ్‌

  • అయ్యాయనే విషయం మీకు తెలుసా?

  • ఫోన్‌ నంబర్లు పంపిన ‘పెద్దాయన’ కేసీఆరేనా?.. 7 గంటలపాటు విచారణ

  • అవసరమైతే మరోసారి రావాలన్న సిట్‌

హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సకు కోట్లాది రూపాయల ఎలక్టోరల్‌ బాండ్లు ఎలా వచ్చాయి? పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్‌ చేసి.. వారి కాల్‌ రికార్డుల ఆధారంగా బెదిరించి పార్టీకి బాండ్లు వచ్చేలా చేశారా? ఎన్నికల సమయంలో వార్‌రూమ్స్‌ పేరిట అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ ఎందుకు చేశారు? ప్రైవేటు వ్యక్తి అయిన చానల్‌ ఎండీ శ్రవణ్‌రావు ఆధ్వర్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌ ఎలా చేస్తారు? అనధికారికంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడటం, ఆ సమాచారం ఆధారంగా లబ్ధి పొందడం నేరమవుతుందని తెలియదా? ట్యాపింగ్‌ చేయాలంటూ ఫోన్‌ నంబర్లు పంపిన పెద్దాయన కేసీఆరేనా? అంటూ సిట్‌ అధికారులు.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి శుక్రవారం విచారణకు హాజరైన కేటీఆర్‌ను వారు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 11 గంటలకు కేటీఆర్‌ సిట్‌ కార్యాలయానికి రాగా, సాయంత్రం 6 గంట ల దాకా సుమారు ఏడు గంటలపాటు ప్రశ్నించారు. అనంతరం.. అవసరమైతే మరోసారి విచారణకు రావా ల్సి ఉంటుందని చెప్పి పంపించివేశారు. విచారణలో భాగంగా సిట్‌ అధికారులు కేటీఆర్‌ వద్ద పలు అంశాలను ప్రస్తావించారు. విశ్వసనీయ సమాచారం ప్రకా రం.. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా తెలుసుకున్న విషయాలు, కాల్‌ రికార్డులను ఆధారంగా చేసుకుని, వాటిని ఆయుధంగా మలచుకుని పలువురు పారిశ్రామికవేత్తలను, సెలబ్రిటీలను బెదిరించి బీఆర్‌ఎస్‌కు కోట్లాది రూపాయల ఎలకో్ట్రరల్‌ బాండ్లు తెప్పించుకున్నారన్న విషయాలపై సిట్‌ ఎక్కువగా ఫోకస్‌ చేసింది. గతంలో రాధాకిషన్‌రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్‌ను సిట్‌ అధికారులు ప్రశ్నించారు.


తనకు కొన్ని ఫోన్‌ నంబర్లను నాటి పెద్దాయన ఆఫీసు నుంచి కాగితాల మీద రాసి పంపించేవారని, మరికొన్ని ఫోన్‌ నంబర్లను తమ సీపీ ద్వారా పంపించారని, వాటన్నింటినీ తాను ఎస్‌ఐబీకి పంపించి నిఘా పెట్టించేవాడినని రాధాకిషన్‌రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఫోన్‌ సంభాషణల రికార్డింగ్‌ ముగిసిన తర్వాత వాటిని నాటి పెద్దలకు ఇచ్చానని రాధాకిషన్‌రావు చెప్పిన నేపథ్యంలో, ‘‘ఆ ఫోన్‌ నంబర్లను మీరు ఇచ్చారా? పెద్దాయన అంటే ఎవరు? నాటి సీఎం కేసీఆరే పెద్దాయన కదా!’’ అంటూ కేటీఆర్‌ను సిట్‌ ప్రశ్నించినట్లు తెలిసింది.

శ్రీధర్‌రావు వాంగ్మూలం ఆధారంగా కూడా..

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనను బెదిరించి, భయపెట్టి బీఆర్‌ఎ్‌సకు ఎలకో్ట్రరల్‌ బాండ్లు తీసుకున్నారం టూ సంధ్య కన్వెన్షన్‌ యజమాని శ్రీధర్‌రావు గతంలో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కూడా సిట్‌ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. టాస్క్‌ఫోర్స్‌ బృందాలను అడ్డం పెట్టుకుని 2023 ఎన్నికల సమయంలో, అంతకుముందు జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సమయంలో పెద్ద ఎత్తున డబ్బు పట్టుకు న్న విషయాన్ని సిట్‌ అధికారులు తేదీలతో సహా కేటీఆర్‌కు చూపించి.. ఆ తర్వాత ఆయా వ్యక్తులు, సంస్థల నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీకి వచ్చిన ఎలకో్ట్రరల్‌ బాండ్లపై పలుమార్లు ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి నాటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, ఆయన వద్ద పనిచేస్తున్న ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావుతో కేటీఆర్‌ పలుమార్లు వాట్సాప్‌, సిగ్నల్‌ చాట్‌ ద్వారా మాట్లాడిన వివరాలను బయటపెట్టి.. వారితో ఏ విషయాలపై మాట్లాడారని ప్రశ్నించినట్లు తెలిసింది. గతంలో ఈ కేసులో అరెస్టయిన మాజీ పోలీసు అధికారుల ఫోన్లను స్వాధీనం చే సుకున్న సిట్‌ అధికారులు.. ఆయా ఫోన్లలోని డేటాను పూర్తిగా ఆధునిక సాంకేతికత ద్వారా వెలికితీయగలిగారు. సిట్‌ అధికారులు అరెస్టు చేసే సమయానికి కొందరు పోలీసు అధికారులు తమ ఫోన్లలోని డేటాను డిలీట్‌ చేశారు. తాజాగా 14 రోజులపాటు సిట్‌ విచారణను ఎదుర్కొన్న ప్రభాకర్‌రావు సైతం తన రెండు ఫోన్లలోని డేటాను డిలీట్‌ చేశారు. ఎఫ్‌ఎ్‌సఎల్‌ అధికారుల సహకారంతో సాంకేతిక ఆధారాలు సేకరించిన సిట్‌ అధికారులు.. కేటీఆర్‌ను ఒక ప్రశ్న తర్వాత మరో ప్రశ్న అడుగుతూ వివరాలు రాబట్టడానికి ప్రయత్నించారని తెలిసింది.


మరో గదిలో రాధాకిషన్‌రావు..

శుక్రవారం రాధాకిషన్‌రావును కూడా పిలిపించిన సిట్‌ అధికారులు.. ఆయనను, కేటీఆర్‌ను వేర్వేరు గదు ల్లో కూర్చోబెట్టి ఒకే ప్రశ్న అడిగారు. అయితే ఇద్దరి నుంచి పరస్పర విరుద్ధమైన సమాధానాలు వచ్చాయని, దీంతో మరలా ఆయా ప్రశ్నలకు సంబంధించి తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు 2023లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ తరఫున ఆరుచోట్ల ప్రైవేటుగా వార్‌రూమ్స్‌ ఏర్పాటు చేసి అనధికారికంగా ఫోన్లను ట్యాపింగ్‌ చేయడంపైనా కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. వేల ఫోన్లను ట్యాపింగ్‌ చేయడంతో పాటు ఆయా వ్యక్తుల కదలికలను మానిటరింగ్‌ చేసిన విధానంపైనా ప్రశ్నించినట్లు సమాచారం. వార్‌రూమ్స్‌ పేరిట అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం, అందులోనూ ప్రైవేటు వ్యక్తి అయిన ఒక చానల్‌ ఎండీ శ్రవణ్‌రావు ఆధ్వర్యంలో ట్యాపింగ్‌కు పాల్పడటంపై సిట్‌ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. శ్రవణ్‌రావు ఖాతాల నుంచి జరిగిన నిధుల బదిలీలో అంతిమ లబ్ధిదారుల వివరాల ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌ చట్టబద్ధమేనని కేటీఆర్‌ పదే పదే చెబుతున్న నేపథ్యంలో అనధికారికంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడటం, ఆయా ట్యాపింగ్‌ సమాచారం ఆధారంగా లబ్ధి పొందడం నేరమవుతుందని తెలియదా? అని కేటీఆర్‌ను సిట్‌ అధికారులు నిలదీసినట్లు తెలిసింది.

ఈ నెంబర్లు మీకు తెలుసా..?

విచారణలో భాగంగా కేటీఆర్‌కు సంబంధించిన కొందరు సన్నిహితుల ఫోన్‌ నంబర్లను ఆయనకు చూపించి.. ఇవి కూడా ట్యాప్‌ అయ్యాయన్న విషయం మీకు తెలుసా? ఎవరు ట్యాపింగ్‌ చేయించి ఉంటారు? అని సిట్‌ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. చాలా ప్రశ్నలకు కేటీఆర్‌ తనకు తెలియదనే సమాధానమే ఇచ్చినట్లు తెలిసింది. విచారణ క్రమంలో కేటీఆర్‌ ఇతర విషయాలను సిట్‌ అధికారుల ముందు ప్రస్తావించి వాదనకు ప్రయత్నించారని సమాచారం.

మళ్లీ పిలుస్తాం: సజ్జన్నార్‌

పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో 2024లో క్రైం నెంబర్‌ 243 ప్రకారం నమోదైన కేసు విచారణలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్‌ను సిట్‌ అధికారులు శుక్రవారం విచారించారని, ఆయన వాం గ్మూలాన్ని నమోదు చేశారని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సాక్షులను కలవవద్దని, ప్రలోభాలకు గురి చేయవద్దని కేటీఆర్‌కు సూచించామన్నారు. అవసరముంటే మరోసారి నోటీసులు ఇస్తామని, విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఉద్యమ కేసులతో ట్యాపింగ్‌ కేసుకు పోలికా?

రాష్ట్రాన్ని 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం: కోమటిరెడ్డి

Updated Date - Jan 24 , 2026 | 06:46 AM