రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం: కోమటిరెడ్డి
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:26 AM
తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని, ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో...
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని, ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్-2047’ అనే స్పష్టమైన విజన్‌తో పనిచేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఐటీ, ఫార్మా రంగాలను ప్రోత్సహిస్తున్నామని, ఇటీవల జరిగిన భారత్ గ్లోబల్ సమ్మిట్‌లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామన్నారు. శుక్రవారం హైటెక్స్‌లో జరిగిన ‘ఏస్‌టెక్ హైదరాబాద్-2026’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏస్ టెక్ కార్యక్రమం కేవలం ఎగ్జిబిషన్ మాత్రమే కాదని, కొత్త టెక్నాలజీలు, కొత్త అవకాశాలు, ఆలోచనలపై ఇక్కడ చర్చలు జరుగుతాయన్నారు.