7 నుంచి అసెంబ్లీ
ABN , Publish Date - Aug 25 , 2026 | 04:43 AM
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం స్పష్టతనిచ్చారు. సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని తెలిపారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులతో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం చెప్పాలి
22-ఏపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: రేవంత్
ప్రతిపక్షాలకు తగిన సమాధానం చెప్పాలి
సీఎం రేవంత్ రెడ్డి సూచన
హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం స్పష్టతనిచ్చారు. సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని తెలిపారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులతో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సమావేశాలకు ఎమ్మెల్యేలంతా హాజరవ్వాలని, వారి వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత విప్‌లపైనే ఉందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాలకు ధీటుగా సమాధానం చెప్పాలని, అలాగే 22-ఏపై చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పి కొట్టాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా జెన్-జీకి కనెక్ట్ అవ్వాలని తెలిపారు. అందుకోసం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇతరత్రా అంశాలను దాని ద్వారా ప్రచారం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేల పీఆర్వోలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో బాగా పనిచేయాలని, పెండింగ్ అంశాలపై దృష్టి సారించాలన్నారు. ప్రధానంగా నియోజకవర్గాల పరిధిలోని నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ భూ సేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ఎప్పటికీ ప్రాజెక్టులు పూర్తికావని చెప్పారు. భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్, ఫారెస్టు క్లియరెన్స్‌లకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.