Sankranti festival: సంక్రాంతికి ఊరెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలి..
ABN , Publish Date - Jan 07 , 2026 | 10:37 AM
సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా నగరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా ఏరియాలకు వేలాదొ కుటుంబాలు వెలుతుంటాయి. అయితే.. వీరంతా జాగ్రత్తలు పాటాంచాలని సూచిస్తున్నారు.
- సూరారం సీఐ సుధీర్ కృష్ణ
హైదరాబాద్: సంక్రాతికి(Sankranti) ఊరు వెళ్లే వారు తమ ఇళ్లలో చోరీలు జరగకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సీఐ సుధీర్‌కృష్ణ సూచించారు. ఊరు వెళ్లడానికి ముందే ఇంటి మొయిన్ డోర్‌కు సెంట్రల్ లాక్ సిస్టమ్‌ను, సెక్యూరిటీ అలారం, సెన్సార్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వెండి, బంగారం ఆభరణాలు, డబ్బులను ఇంట్లో ఉంచుకుండా బ్యాంక్ లాకర్‌లో భద్రపర్చుకోవాలని అన్నారు. ఇంట్లోని ఒక లైట్‌ను ఆన్‌చేసి వెళ్లాలన్నారు. కార్లు, టూ వీలర్లకు జీపీఎస్ ట్రాకర్ అమర్చుకోవాలని, ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను అమర్చుకొని, ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించుకోవాలన్నారు.
అలాగే, ఊరెళ్తున్న విషయాన్ని అపరిచితులకు చెప్పొద్దన్నారు. ఊరెళ్తున్న విషయాన్ని పోలీసుస్టేషన్‌కు వచ్చి తెలియజేయాలని, అలా చేస్తే పోలీసులు మీ ఇంటిపై ఓ కన్నేసి ఉంచుతారని అన్నారు. మీ కాలనీలో అనుమానితులు సంచరిస్తుంటే అత్యవసర సమయాల్లో 122కు కాల్ చేయాలని లేదా సూరారం పోలీస్ స్టేషన్ నెంబరు 87126 63299,సీఐ 8712663290, డీఎ్‌సఐ 8712663297, డీఐ 8712663271లకు సమాచారం ఇవ్వాలని సీఐ సుధీర్‌కృష్ణ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News