Share News

తీవ్ర విషాదం.. శుభకార్యం జరగాల్సిన ఇంట విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

ABN , Publish Date - Nov 29 , 2026 | 04:33 PM

శుభకార్యం జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ శుభకార్యం కోసం టెంట్‌ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతిచెందారు. ఈ విషాద ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

తీవ్ర విషాదం.. శుభకార్యం జరగాల్సిన ఇంట విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
Yellampet Electric Shock

మేడ్చల్‌ మల్కాజిగిరి, నవంబర్ 29: శుభకార్యం జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ వేడుక సందర్భంగా టెంట్‌ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతిచెందారు. ఈ విషాద ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట్‌‌లో చోటుచేసుకుంది. ఇద్దరి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఎల్లంపేట్‌‌లోని ఓ ఇంట్లో ఈరోజు (ఆదివారం) శుభకార్యం జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా దగ్గరి బంధువులు ఎల్లంపేట్‌కు చేరుకున్నారు. కుటుంబసభ్యులు, బంధువులంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో గడ్డం గోపి, లబండీ బాబు టెంట్‌ ఏర్పాటు చేస్తున్నారు. అయితే, టెంట్ కర్రలకు ఉన్న ఇనుప రాడ్లు ప్రమాదవశాత్తూ విద్యుత్‌ తీగలకు తగిలాయి. దీంతో ఒక్కసారిగా విద్యుత్‌ ప్రవహించి ఆ ఇద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. అనంతరం గోపి, బాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


సమాచారం అందుకున్న మేడ్చల్‌ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుభకార్యంతో సందడిగా ఉండాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొనడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇద్దరి మృతితో ఎల్లంపేట్‌‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా?: ఎమ్మెల్యే హరీశ్ రావు

హైదరాబాద్‌లో అత్తాకోడళ్లను కట్టేసి పట్టపగలే రూ.3.20 కోట్ల చోరీ

డీలిమిటేషన్ బిల్లుతో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగే ప్రమాదం: ఎంపీ మల్లు రవి

Updated Date - Nov 29 , 2026 | 04:44 PM