వికారాబాద్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
ABN , Publish Date - Sep 22 , 2026 | 09:13 PM
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మహావీర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. తనను ర్యాగింగ్ చేస్తున్నారని ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వికారాబాద్: జిల్లా కేంద్రంలోని మహావీర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని కొందరు సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు వెంటనే కళాశాలకు చేరుకున్నారు. ర్యాగింగ్ ఆరోపణలపై కళాశాల యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే, వారు అడిగిన ప్రశ్నలకు మేనేజ్‌మెంట్ స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.
కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ర్యాగింగ్ ఆరోపణలపై అధికారులు స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.
Also Read:
వీధిలో డీజే.. గుండెపోటుతో 2వ తరగతి బాలిక మృతి
ఆయుర్వేద ఆసుపత్రుల అభివృద్ధికి భారీగా నిధులు: సత్యకుమార్