Share News

ఉమ్మడి రంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం గెలుపు ఎవరిదంటే

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:29 PM

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఈ నెల 11న పోలింగ్‌ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉమ్మడి రంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం గెలుపు ఎవరిదంటే
Ranga Reddy Municipal Elections

రంగారెడ్డి, ఫిబ్రవరి 12: తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఈ నెల 11న(బుధవారం) పోలింగ్‌ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సర్వే ప్రకారం.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీ చెరో స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉండగా.. ఒక స్థానంలో హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని సర్వేలో తేలింది.


రంగారెడ్డి జిల్లాలో మొత్తం మొత్తం 14 మున్సిపాలిటీలు ఉండగా.. 13 స్థానాల్లో మాత్రమే ఎన్నిక జరిగింది. కొత్తూరులో ఎన్నిక జరుగలేదు. అలాగే వికారాబాద్‌లో రెండు స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.




ఇవి కూడా చదవండి...

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

సభలో వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆవేదన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 02:11 PM