Share News

ఏరోస్పెస్‌ పరిశ్రమలకు ప్రోత్సాహం: శ్రీధర్‌బాబు

ABN , Publish Date - Nov 18 , 2026 | 07:11 AM

ఏరోస్పెస్‌ పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

ఏరోస్పెస్‌ పరిశ్రమలకు ప్రోత్సాహం: శ్రీధర్‌బాబు
Duddilla Sridhar Babu

కొత్తూర్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఏరోస్పెస్‌ పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పారిశ్రామికవాడలోని జేఈహెచ్‌ ఏరోస్పెస్‌ పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన టూలింగ్‌ సెంటర్‌ను మంగళవారం షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరోస్పెస్‌ పరిశ్రమల ఏర్పాటుకు యువత ముందుకు వస్తున్నారని, వారికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందిస్తుందన్నారు. ఏరోస్పెస్‌ పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యువ పారిశ్రామికవేత్తలు కొత్తకొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యవతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై

రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 18 , 2026 | 07:11 AM