రంగారెడ్డి జిల్లాలో దారుణం.. సెల్‌ఫోన్ కోసం యువకుడిపై కత్తితో దాడి
ABN , Publish Date - Oct 11 , 2026 | 08:42 AM
ఓ యువకుడిపై కత్తితో దాడి చేసి సెల్‌ఫోన్‌ను దోచుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. ఆరంగర్‌లోని ఎంఎస్ కాలేజీ సమీపం రైల్వే ట్రాక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడిని కత్తితో బెదిరించిన దుండగుడు అనంతరం అతడిపై దాడి చేసి సెల్‌ఫోన్‌తో పరారయ్యాడు.
రంగారెడ్డి జిల్లా: ఓ యువకుడిపై కత్తితో దాడి చేసి సెల్‌ఫోన్‌ను దోచుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. ఆరంగర్‌లోని ఎంఎస్ కాలేజీ సమీపం రైల్వే ట్రాక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడిని కత్తితో బెదిరించిన దుండగుడు అనంతరం అతడిపై దాడి చేసి సెల్‌ఫోన్‌తో పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. రైల్వే ట్రాక్ సమీపంలో ఓ యువకుడిని దుండగుడు లక్ష్యంగా చేసుకున్నాడు. అతని వద్దకు వెళ్లి సెల్‌ఫోన్ ఇవ్వాలంటూ కత్తితో బెదిరించాడు. అయితే, ఇందుకు బాధితుడు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన దుండగుడు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. బాధితుడి భుజం, పొట్ట భాగాల్లో కత్తితో పొడిచాడు. అనంతరం అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీతో పాటు సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడిని గుర్తించారు. కిషన్‌బాగ్‌కు చెందిన సయ్యద్ జహీర్ (25)ను అరెస్ట్ చేశారు.
నిందితుడి సయ్యద్ జహీర్ నుంచి దోపిడీకి గురైన సెల్‌ఫోన్‌తో పాటు ద్విచక్రవాహనం, దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. కాగా, సెల్‌ఫోన్ కోసం యువకుడిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బేబీ రుక్సానాకు మెరుగైన వైద్యం, ఆమె తల్లికి ఉద్యోగం కల్పిస్తాం: మంత్రి దామోదర
జగన్ అక్రమాస్తుల కేసుల్లో వేగం పెంచాలి.. తెలంగాణ హై కోర్టులో ఈడీ పిటిషన్