సంగారెడ్డిలోని గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:35 PM
సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. ఎరిత్రో ఫార్మా కంపెనీలో అకస్మాత్తుగా రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో పరిశ్రమ ప్రాంగణం అంతా మంటల్లో చిక్కుకోగా, దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది.
సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఉన్న ఎరిత్రో ఫార్మా పరిశ్రమలో అకస్మాత్తుగా రియాక్టర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా మంటలు పరిసర ప్రాంతాలను ఆవరించాయి. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ పరిశ్రమ పరిసరాల్లో వ్యాపించింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పలు ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగాయి. పేలుడు కారణంగా ఎవరైనా గాయపడినారా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
పేలుడు ఎలా జరిగింది, రియాక్టర్‌లో ఏవైనా సాంకేతిక లోపాలున్నాయా అనే దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా అనే అంశంపైనా కూడా విచారణ జరుగుతోంది. ఈ ఘటనతో గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..
కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు: మంత్రి వివేక్
Read Latest Telangana News