Share News

ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ గెలుపు

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:52 PM

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. మొత్తం 24 వార్డుల్లో 13 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.

ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ గెలుపు
Ibrahimpatnam Municipality

రంగారెడ్డి, ఫిబ్రవరి 13: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కౌంటింగ్ పూర్తయింది. బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎక్కువ వార్డులను కైవసం చేసుకున్నారు. మొత్తం 24 వార్డుల్లో బీఆర్‌ఎస్ 13 స్థానాల్లో విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీ 8 వార్డులను సొంతం చేసుకోగా.. బీజేపీ అభ్యర్థులు 2 వార్డుల్లో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు.


గెలుపొందిన అభ్యర్థులు..

  • 1వ వార్డు : బీజేపీ - ముత్యాల శ్యామల

  • 2వ వార్డు: కాంగ్రెస్ - నీళ్ల భాను బాబు

  • 3వ వార్డు: స్వంతంత్ర అభ్యర్థి - దాసరి మురళీకృష్ణ (90 మెజారిటీ)

  • 4వ వార్డు: బీఆర్‌ఎస్ - కొండ్రు ప్రవీణ్ కుమార్ (13 మెజారిటీ)

  • 5వ వార్డు: బీఆర్‌ఎస్ - జెర్కొని మమత రాజు

  • 6వ వార్డు: కాంగ్రెస్ - మహమ్మద్ అమీనా బేగం

  • 7వ వార్డు: బీఆర్‌ఎస్ - సుదర్శన్ రెడ్డి (2 ఓట్లతో గెలుపు)

  • 8వ వార్డు: కాంగ్రెస్ - వర్థ్య రాందాస్

  • 9వ వార్డు: కాంగ్రెస్ - దారు రాఘవేంద్రరావు

  • 10వ వార్డు: కాంగ్రెస్ - విజయం దొంతర మోని భార్గవి

  • 11వ వార్డు: బీఆర్‌ఎస్ - కొండ్రు శ్రీలత

  • 12వ వార్డు: బీఆర్‌ఎస్ - కొండిగారి త్రిలోక్ కుమార్

  • 13వ వార్డు: కాంగ్రెస్ - ఇందూరి శ్రీనివాస్

  • 14వ వార్డు: కాంగ్రెస్ - ఎదుల్లా విజయలక్ష్మి

  • 15వ వార్డు: బీఆర్ఎస్- క్యామ శంకర్ (100 ఓట్ల మెజారిటీ)

  • 16వ వార్డు: బీఆర్‌ఎస్ - అల్వాల జ్యోతి వెంకటరెడ్డి (343 మెజారిటీ )

  • 17వ వార్డు: బీఆర్‌ఎస్ - మడుపు లక్షమ్మ

  • 18వ వార్డు: బీజేపీ - సిద్ధం భానుప్రియ

  • 19వ వార్డు: బీఆర్‌ఎస్ - ఆకుల యాదగిరి

  • 20వ వార్డు: బీఆర్‌ఎస్ - మంద జయ

  • 21వ వార్డు: బీఆర్‌ఎస్ - చిలుక బుగ్గ రాములు

  • 22వ వార్డు: కాంగ్రెస్ - కప్పరి స్రవంతి

  • 23వ వార్డు: బీఆర్‌ఎస్ - నీలం శ్వేతా

  • 24వ వార్డు: బీఆర్ఎస్ - గూడూరు గిరీశ్


ఇవి కూడా చదవండి...

అలంపూర్ నియోజకవర్గం.. మూడు మున్సిపాలిటీల ఫలితాలివే..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌దే పైచేయి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 01:17 PM