Share News

పుదుచ్చేరి సముద్రంలో తెలంగాణ విద్యార్థుల గల్లంతు.. ఆరుగురు సురక్షితం, ఒకరి కోసం గాలింపు!

ABN , Publish Date - Nov 29 , 2026 | 10:09 AM

పుదుచ్చేరి సముద్రంలో తెలంగాణ విద్యార్థులు కొట్టుకుపోయారు. ఏడుగురిలో ఆరుగురిని లైఫ్ గార్డ్స్ రక్షించగా, ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. గాలింపు కొనసాగుతోంది.

పుదుచ్చేరి సముద్రంలో తెలంగాణ విద్యార్థుల గల్లంతు.. ఆరుగురు సురక్షితం, ఒకరి కోసం గాలింపు!
Puducherry Telangana students

పుదుచ్చేరి, నవంబర్ 29: విహారయాత్ర కోసం పుదుచ్చేరి వెళ్లిన తెలంగాణ విద్యార్థులు సముద్ర ప్రమాదంలో చిక్కుకున్నారు. సముద్ర స్నానానికి దిగిన ఏడుగురు విద్యార్థులు అలల ఉధృతికి కొట్టుకుపోయారు. గమనించిన స్థానిక లైఫ్ గార్డ్స్ వెంటనే స్పందించి సాహసోపేతంగా ఆరుగురు విద్యార్థులను రక్షించగా, మరో విద్యార్థి సముద్రంలో గల్లంతయ్యాడు.

బాధిత విద్యార్థులంతా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. గల్లంతైన విద్యార్థి ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, లైఫ్ గార్డ్స్ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రక్షించిన ఆరుగురు విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందిస్తుండగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (Puducherry Telangana students)


ఈ వార్తలు కూడా చదవండి:

అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర.. వచ్చే వారమూ అదే సీన్!

ఓ చేతిలో తుపాకి.. మరో చేతిలో కర్రతో...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 10:09 AM