పాలిమర్ పరిశ్రమ దేశ తయారీ రంగానికి వెన్నెముక
ABN , Publish Date - Aug 08 , 2026 | 07:13 AM
ప్లాస్టిక్స్, పాలిమర్ పారిశ్రామిక రంగం దేశ తయారీ రంగంలో అత్యంత కీలకమైందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
ప్రత్యక్షంగా 50 లక్షల మందికి.. పరోక్షంగా కోటిమందికి ఉపాధి మంత్రి దుద్దిళ్ల శీధర్ బాబు
హైదరాబాద్: ప్లాస్టిక్స్, పాలిమర్ పారిశ్రామిక రంగం దేశ తయారీ రంగంలో అత్యంత కీలకమైందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గృహనిర్మాణం, తాగునీటి సరఫరా, వ్యవసాయం, వైద్యరంగం, ఔషధ తయారీ, ఆటోమొబైల్, ఎలకా్ట్రనిక్స్, ఆహార ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాల రంగాలకు అవసరమైన ముడి పదార్థాలను ఈ రంగమే అందిస్తోందన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన హిప్లెక్స్-2026 సదస్సులో ప్లాస్టిక్స్, పాలిమర్స్, ప్రాసెసింగ్ టెక్నాలజీ, యంత్రాల అంతర్జాతీయ ప్రదర్శనను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులను సవాళ్లుగా కాకుండా కొత్త అవకాశాలుగా మలుచుకోవాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పాలిమర్ రంగం పరిశ్రమల అభివృద్థికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఈ రంగం పరిశ్రమల ద్వారా 50 లక్షల మందికి ప్రత్యక్షంగా, కోటికి పైగా మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని, తెలంగాణలోనే సుమారు రెండు లక్షల మంది జీవనోపాధి ఈ రంగంపై ఆధారపడి ఉందని వివరించారు.
త్వరలో డిజిటల్ అసెంబ్లీ
త్వరలోనే రాష్ట్రంలో ‘డిజిటల్ అసెంబ్లీ’, ‘డిజిటల్ కౌన్సిల్’ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పౌర సేవల్ని మరింత సమర్థంగా ప్రజల ముంగిటకే చేర్చేలా ఏఐ, బ్లాక్ చెయి న్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, క్వాంటం కంప్యూటింగ్ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీలకు పాలనలో పెద్దపీట వేస్తున్నామన్నారు. గవ్ కనెక్ట్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ(మీసేవ) సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో నిర్వహించిన ‘ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్ కాంక్లేవ్(తెలంగాణ)’ను ఆయ న ప్రారంభించి మాట్లాడారు. పౌరుల డేటా భద్రత కు పెద్దపీట వేసేలా త్వరలోనే బ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికెట్ల జారీకి శ్రీకారం చుడతామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మూసీ ప్రాజెక్టుకు లైన్‌క్లియర్
Read Latest AP News And Telangana News And International News And Telugu News