తెలంగాణలో పోక్సో చట్టం సమర్థవంతంగా అమలు చేయండి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Jul 15 , 2026 | 06:00 PM
తెలంగాణలో పోక్సో చట్టం సమర్థవంతంగా అమలు చేయడానికి తక్షణం చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు బుధవారం జనసేన పార్టీ తరఫున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.
అమరావతి, జులై 15: తెలంగాణలో పోక్సో చట్టం సమర్థవంతంగా అమలు చేయడానికి తక్షణం చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు బుధవారం జనసేన పార్టీ తరఫున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. పోక్సో కేసుల దర్యాప్తు, బాధితుల రక్షణకు సంబంధించిన పలు అంశాలపై ఆ లేఖలో ఏపీ డిప్యూటీ సీఎం ప్రత్యేక సూచనలు చేశారు. అలాగే ఈ కేసుల దర్యాప్తు 60 నుంచి 90 రోజుల్లో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
బాధితులకు పూర్తి రక్షణ కల్పించే వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆ లేఖలో ఏపీ డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈ కేసుల్లో బెయిల్‌ను గట్టిగా వ్యతిరేకించాలని పేర్కొన్నారు. బాధితులను బెదిరించే నిందితులపై కఠిన నిఘా అవసరమని అభిప్రాయపడ్డారు. బాధితులకు వైద్య పరీక్షలు 24 గంటల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించారు. ఫోరెన్సిక్, డీఎన్‌ఏ ఆధారాలను త్వరితగతిన సేకరించాలని సూచించారు.
ప్రతి జిల్లాలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని పవన్ కల్యాణ్ కోరారు. పోక్సో కేసులపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో నెల వారీ సమీక్షలు నిర్వహించాలని అన్నారు. ఈ కేసుల్లో ఆలస్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలలు, హాస్టళ్లు, ప్రార్థనా స్థలాల్లో తప్పనిసరి రిపోర్టింగ్ విధానం ఉండాలని ఈ లేఖలో తెలంగాణ సీఎం రేవంత్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో ‘సర్’ గడువు పొడిగింపు
మహిళలకు ధైర్యం కోసమే అభయ కార్యక్రమం: వంగలపూడి అనిత
Read Latest AP News And Telugu News