Share News

యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబును నరికిచంపిన దుండగులు

ABN , Publish Date - Sep 17 , 2026 | 06:44 PM

నిజామాబాద్‌లో యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్‌ఆర్‌ చౌరస్తా వద్ద కారులో వెళ్తున్న హరిబాబుపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు.

యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబును నరికిచంపిన దుండగులు
Vaishnavi Husband Haribabu Death News

నిజామాబాద్‌: యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్‌ఆర్‌ చౌరస్తా వద్ద కారులో వచ్చిన దుండగులు హరిబాబుపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


కాగా, జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ప్రముఖ యూట్యూబర్ వైష్ణవిని ( గర్భవతి), అదనపు కట్నం కోసం ఆమె భర్త హరిబాబు 2026 మార్చి నెలలో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబు ఇటీవలే కోర్టు నుంచి బెయిల్ పొంది జైలు నుంచి బయటకు వచ్చాడు.

బెయిల్‌పై తిరుగుతున్న హరిబాబును ఆర్‌ఆర్‌ చౌరస్తా వద్ద గుర్తుతెలియని దుండగులు, నడిరోడ్డుపై కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపారు. భార్య వైష్ణవిని హత్య చేసినందుకు పగతోనే వైష్ణవి కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


Also Read:

మల్లారెడ్డి కుటుంబంపై సొంత పార్టీ నేతల ఆగ్రహం.. ప్రీతి రెడ్డి ఫ్లెక్సీలు చించివేత

385 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికారుల ఆరా.. శాటిలైట్‌ మ్యాప్‌లతో పరిశీలన

Updated Date - Sep 17 , 2026 | 07:19 PM