మల్లారెడ్డి కుటుంబంపై సొంత పార్టీ నేతల ఆగ్రహం.. ప్రీతి రెడ్డి ఫ్లెక్సీలు చించివేత
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:04 PM
మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయ వివాదానికి దారితీశాయి. ఫ్లెక్సీని కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ చించివేశారు.
మేడ్చల్: మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయ వివాదానికి దారితీశాయి. ఫ్లెక్సీలను కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు చించివేశారు. సూరారం, కుత్బుల్లాపూర్, మేడ్చల్ పరిధిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు స్థానిక పార్టీ నేతల ఫొటోలు లేకపోవడంపై కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కార్యకర్తలు మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రీతి రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యుల వ్యవహారంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read:
385 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికారుల ఆరా.. శాటిలైట్ మ్యాప్‌లతో పరిశీలన
వచ్చే మూడేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల పండుగలు నిర్వహిస్తాం: మంత్రి నిమ్మల