Share News

కెమికల్‌ బాక్సు పేలి మహిళ మృతి

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:49 AM

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పేలుడు ఘటన కలకలం రేపింది. మిర్చికాంపౌండ్‌ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందారు.

కెమికల్‌ బాక్సు పేలి మహిళ మృతి
Chemical Box Explosion

  • నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఘటన

నిజామాబాద్‌ కార్పొరేషన్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పేలుడు ఘటన కలకలం రేపింది. మిర్చికాంపౌండ్‌ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందారు. బోధన్‌ రూరల్‌ మండలం అమ్దాపూర్‌ గ్రామానికి చెందిన అనిత (55) చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం కూడా చెత్త ఏరుకుంటూ ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద పడి ఉన్న కెమికల్‌ బాక్సును తెరిచారు.


ఒక్కసారిగా భారీ శబ్దంతో అది పేలడంతో ఆమె కాళ్లు, చేతులు ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చాలాకాలంగా మూతపడి ఉన్న ఆ బాక్సులో వాయువులు పేరుకుపోయి, తెరిచిన వెంటనే పేలి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. సాంకేతిక నిపుణుల సాయంతో క్షుణ్నంగా దర్యాప్తు జరిపి, పేలుడుకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎల్‌నినో ప్రభావం.. నీటిని పొదుపుగా వినియోగించండి: సీఎస్‌

సింగరేణి కార్మికులకు బోనస్‌ బొనాంజా

వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 14 , 2026 | 06:49 AM