Share News

విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులు.. విధుల నుంచి తొలగింపు..

ABN , Publish Date - Jul 18 , 2026 | 04:12 PM

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తబాది మోడల్ స్కూల్‌లో విద్యార్థినులపై వేధింపులు కలకలం రేపాయి. పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు ఉపాధ్యాయులు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించడం సంచలనం సృష్టిస్తోంది.

విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులు.. విధుల నుంచి తొలగింపు..
Kamareddy Model School

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలం కొత్తబాది మోడల్ స్కూల్‌లో విద్యార్థినులపై వేధింపులు కలకలం రేపాయి. ఆ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు ఉపాధ్యాయులు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పలువురు బాలికలు ఆరోపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిల ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ అధికారులు వెంటనే పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. బాలికలు, పాఠశాల సిబ్బంది నుంచి వివరాలు సేకరించి నివేదిక రూపొందించారు.


ప్రాథమిక విచారణలో ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు కాంట్రాక్టు ఉపాధ్యాయులు గోపాల్, పవన్‌ను విధుల నుంచి తొలగించారు. విషయం విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టికి వెళ్లడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో తమ పిల్లల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ కొనసాగుతోందని, దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి

దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

గంజాయి పండిస్తున్న సాధువు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Updated Date - Jul 18 , 2026 | 04:42 PM