Share News

రైతులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ఆదేశాలు..

ABN , Publish Date - Mar 31 , 2026 | 06:39 PM

పసుపు రైతులకు ఊరటనిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాలతో పసుపు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని చెప్పారు. తడిసిన పసుపును కోతలు లేకుండా..

రైతులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ఆదేశాలు..

హైదరాబాద్, మార్చి 31: పసుపు రైతులకు ఊరటనిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాలతో పసుపు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని చెప్పారు. తడిసిన పసుపును కోతలు లేకుండా కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులను హెచ్చరించారు. మార్కెట్ యార్డు అధికారులు రైతులను ఇబ్బంది పెడితే.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ మంత్రి తుమ్మల వార్నింగ్ ఇచ్చారు.


మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. నిజామాబాద్ మార్కెట్‌కు భారీగా పసుపు వచ్చిందన్నారు. 4,500 కుప్పలు (27,400 బస్తాలు) యార్డుకు చేరిందన్నారు. 500 కుప్పలు బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉందని చెప్పిన మంత్రి.. పసుపు రక్షణకు 1,500 టార్పాలిన్‌లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. గాలులు, వర్షాలతో 70 - 80 కుప్పలు తడిశాయన్నారు. దీని కారణంగా దాదాపు 40 మంది రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. తడిసిన పసుపును పూర్తి తూకంతో కొనుగోలు చేయాలని మార్కెట్ యార్డ్ అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.


Also Read:

ఇండిగో కొత్త సీఈఓగా విలియమ్ వాల్ష్

యూసీసీ అమలు, లవ్ జిహాద్‌కు చెక్.. అస్సాంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో

వైభవ్ సూర్యవంశీని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలి: మైఖేల్ వాన్

Updated Date - Mar 31 , 2026 | 06:39 PM