Share News

ఒకే కుటుంబంలో విషాదం.. ఈతకు వెళ్లి నలుగురి చిన్నారుల మృతి

ABN , Publish Date - Jun 05 , 2026 | 07:03 PM

కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండలం బొల్లాక్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. మంజీరా నదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడ్డారు.

ఒకే కుటుంబంలో విషాదం.. ఈతకు వెళ్లి నలుగురి చిన్నారుల మృతి

కామారెడ్డి, జూన్05: జిల్లాలోని పిట్లం మండలం బొల్లాక్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. మంజీరా నదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడ్డారు. బొల్లాక్‌పల్లి సమీపంలోని మంజీరా నదిలో అనిత, పావని, శ్రీవాణి, భాను ఈతకు దిగారు. వీరంతా నదిలో ఊబిలో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని గమనించిన సమీపంలోని ఒక మహిళ వారిని రక్షించే ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను రక్షించారు. అలాగే ఊబిలో చిక్కుకున్న మృతదేహాలను స్థానికుల సహాయంతో బయటకు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బొల్లాక్‌పల్లికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


శుక్రవారం బాన్సువాడ మండలం బుడిమి గ్రామం వద్ద ఎల్లమ్మ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆ గ్రామానికి చెందిన పలు కుటుంబాలు పాల్గొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేడుక జరిగింది. అనంతరం భోజనాలు చేసిన తర్వాత నలుగురు చిన్నారులు మంజీరా నదిలో ఈత కొట్టేందుకు వెళ్లి.. ఊబిలో చిక్కుకుని మరణించారని పోలీసులు చెప్పారు. వీరంతా 10 ఏళ్ల లోపు వారేనని తెలిపారు. చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రులతోపాటు బంధువుల రోదనలు మిన్నంటాయి.


ఈ వార్తలు కూడా చదవండి.. 5

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట మొక్క నాటాలి: ఏపీ డిప్యూటీ సీఎం
Read Latest TG News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 07:08 PM