Share News

ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట మొక్క నాటాలి: ఏపీ డిప్యూటీ సీఎం

ABN , Publish Date - Jun 05 , 2026 | 03:17 PM

ధరిత్రి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మనం నాటే ప్రతి మొక్క మహావృక్షం కావాలని ఆయన ఆకాంక్షించారు. శుక్రవారం (జూన్ 5వ తేదీ) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్‌ఫ్లై పార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ హాజరయ్యారు.

ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట మొక్క నాటాలి: ఏపీ డిప్యూటీ సీఎం
AP Dy CM Pawan Kalyan

ఎన్టీఆర్, జూన్05: ధరిత్రి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మనం నాటే ప్రతి మొక్క మహావృక్షం కావాలని ఆయన ఆకాంక్షించారు. శుక్రవారం (జూన్ 5వ తేదీ) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్‌ఫ్లై పార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన తల్లి అంజనా దేవి పేరిట తెల్లపొణికి మొక్కను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాటడం ద్వారా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వర్షా కాలంలో రాష్ట్రమంతటా సీడ్ బాల్స్ చల్లడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెప్పారు.


‘ఏక్ పేడ్ మా కే నామ్’ థీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట మొక్క నాటాల్సి ఉందన్నారు. ప్రతి చెట్టు వాతావరణ మార్పులపై రక్షణ కవచంగా నిలవాలని పేర్కొన్నారు. చెట్లు నాటడం ద్వారా రాష్ట్రాన్ని పచ్చగా మార్చి.. వాతావరణ మార్పుల నుంచి భూమిని కాపాడుకుందామని మానవాళికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కల్తీ చాక్లెట్ల తయారీ గుట్టురట్టు.. ఒకరి అరెస్ట్

మొక్కలు పెంచే వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు.. సీఎం సరదా వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 03:20 PM