కల్తీ చాక్లెట్ల తయారీ గుట్టురట్టు.. ఒకరి అరెస్ట్
ABN , Publish Date - Jun 05 , 2026 | 02:40 PM
హైదరాబాద్‌లో కల్తీ చాక్లెట్ల తయారీ గుట్టును హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ అండ్ సేఫ్టీ టీమ్ (H-FAST) రట్టు చేసింది. సీతారాంబాగ్ (పాత మల్లేపల్లి) ప్రాంతంలో విగ్ట్నెట్ ఫుడ్ స్పెషాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై హెచ్ ఫాస్ట్ టీమ్ దాడులు నిర్వహించింది.
హైదరాబాద్, జూన్ 05: మహానగరంలోని కల్తీ చాక్లెట్ల తయారీ గుట్టును హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ అండ్ సేఫ్టీ టీమ్ (H-FAST) రట్టు చేసింది. సీతారాంబాగ్ (పాత మల్లేపల్లి) ప్రాంతంలో విగ్ట్నెట్ ఫుడ్ స్పెషాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై హెచ్ ఫాస్ట్ టీమ్ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా గడువు ముగిసిన రసాయన పదార్థాలతో కల్తీ చాక్లెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించింది. అందుకు సంబంధించి కార్తీక్ అనే వ్యక్తిని హెచ్ ఫాస్ట్ టీమ్ అరెస్ట్ చేసింది. ఈ సంస్థలో రసాయన పదార్థాలతో కల్తీ చాక్లెట్లు తయారు చేస్తున్నట్లు హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ అండ్ సేఫ్టీ టీమ్‌కు సమాచారం అందింది. దీంతో ఈ సంస్థపై సదరు టీమ్ దాడి చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎర్రటి ఎండలో ఉత్సాహంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు
మొక్కలు పెంచే వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు.. సీఎం సరదా వ్యాఖ్యలు
Read Latest TG News And Telugu News