కామారెడ్డిలో కారు బీభత్సం.. పలువురికి గాయాలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 08:07 AM
మద్యం మత్తులో ఒక వ్యక్తి కారును రాంగ్ రూట్‌లో నడిపి.. పలువురు గాయపడేందుకు కారణమయ్యాడు. స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు.
కామారెడ్డి, మార్చి 26: మద్యం మత్తులో ఒక వ్యక్తి కారును రాంగ్ రూట్‌లో నడిపి.. పలువురు గాయపడేందుకు కారణమయ్యాడు. స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు. అతడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి కొత్త బస్టాండ్ రోడ్డులో గురువారం ఉదయం కారును రాంగ్ రూట్‌లో నడిపి డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. స్థానిక జయ ఆసుపత్రి ముందు నిలిపి ఉంచిన వాహనాలను తన కారుతో ఢీ కొట్టాడు. అనంతరం బైక్‌పై వెళ్తున్న జంటను ఢీ కొట్టి.. పార్క్ చేసిన మూడు బైక్‌పైకి కారును వేగంగా నడిపాడు.
అలాగే రెడ్డి టిఫిన్ సెంటర్ వద్ద ఆగి ఉన్న అంబులెన్స్‌ను సైతం ఢీ కొట్టాడు. దాంతో కారు వేగం తగ్గింది. ఈ ఘటనలో గాయపడిన వారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని పోలీసులకు బాధితులు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నదిలో పడిన బస్సు.. 23 మంది మృతి
ప్రకాశం జిల్లా రాయవరం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
For More TG News And Telugu News