Share News

బస్సు ఆపలేదని ప్రయాణికుడి వీరంగం.. వీడియో వైరల్..

ABN , Publish Date - Apr 26 , 2026 | 03:37 PM

బస్సు ఆపలేదనే కోపంతో ఒక ప్రయాణికుడు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి దిగిన ఘటన నల్గొండలో కలకలం రేపింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బస్సు ఆపలేదని ప్రయాణికుడి వీరంగం.. వీడియో వైరల్..
Nalgonda News

నల్లగొండ, ఏప్రిల్ 26: బస్సు ఆపలేదనే కోపంతో ఒక ప్రయాణికుడు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి దిగిన ఘటన నల్గొండలో కలకలం రేపింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నల్గొండ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు నల్గొండ నుంచి హైదరాబాద్‌లోని దిల్‍సుఖ్‍నగర్ వైపు వెళ్తోంది. మార్గమధ్యలో ఒక ప్రయాణికుడు బస్సును ఆపమని కోరగా, డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన సదరు ప్రయాణికుడు, బస్సును వెంబడించి డ్రైవర్‌ను అడ్డుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ వ్యక్తి.. డ్రైవర్ రామ్ కుమార్‌ను బస్సు నుంచి కిందకు లాగి, రోడ్డుపై పడేసి పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు.


ఈ ఆకస్మిక దాడిలో డ్రైవర్ రామ్ కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అక్కడున్న తోటి ప్రయాణికులు, స్థానికులు వారించే ప్రయత్నం చేసినా సదరు వ్యక్తి శాంతించలేదు. ఈ ఘటనపై బాధితుడు రామ్ కుమార్ నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడంపై పోలీసులు నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.


ఇవి కూడా చదవండి:

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు.. మరోసారి సంక్షోభంలో పడ్డాయా..

ఐపీఎల్ 2026: 36 బంతుల్లోనే వైభవ్ సెంచరీ.. ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ ఎంతంటే?

Updated Date - Apr 26 , 2026 | 04:10 PM