Share News

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు.. మరోసారి సంక్షోభంలో పడ్డాయా..

ABN , Publish Date - Apr 25 , 2026 | 09:42 PM

అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన రెండో దఫా శాంతి చర్చలు మరోసారి సంక్షోభంలో పడినట్లు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన కీలక సమావేశాలకు ఇరాన్ సానుకూలంగా స్పందించకపోవడం ఈ అనిశ్చితిని మరింత పెంచింది.

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు.. మరోసారి సంక్షోభంలో పడ్డాయా..
US Iran peace talks 2026

అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన రెండో దఫా శాంతి చర్చలు మరోసారి సంక్షోభంలో పడినట్లు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన కీలక సమావేశాలకు ఇరాన్ సానుకూలంగా స్పందించకపోవడం ఈ అనిశ్చితిని మరింత పెంచింది. ఇరాన్ ప్రతినిధి బృందం అమెరికా ప్రతినిధులతో నేరుగా సమావేశం కావడానికి సిద్ధంగా లేదు. తమ చర్చలు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ద్వారా మాత్రమే కొనసాగుతాయని టెహ్రాన్ వెల్లడించింది (US Iran peace talks 2026).


శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతినిధులను ఇస్లామాబాద్‌కు పంపేందుకు అమెరికా సిద్ధమైంది. అయితే ఇరాన్ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడంతో, ఈ సమావేశాలు సందిగ్ధంలో పడ్డాయి. ఈ అనిశ్చితికి ప్రధాన కారణం ఇరాన్ అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి అంశాలపై ఉన్న విభేదాలే. అమెరికా ఇరాన్ అణు అభివృద్ధిని పూర్తిగా ఆపాలని కోరుతుండగా, ఇరాన్ మాత్రం తన భద్రతపై రాజీ పడేందుకు సిద్ధంగా లేదు (Islamabad talks crisis).


ఇంతకుముందు ఏప్రిల్ 11–12 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు కూడా ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ముఖ్యంగా అణు కార్యక్రమం, హార్ముజ్ నియంత్రణ వంటి అంశాలపై రెండు దేశాలు ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. తమ పోర్టులు, నౌకలపై దిగ్బంధనాన్ని తొలగిస్తేనే చర్చలకు వస్తామని ఇరాన్ పట్టుబడుతోంది. అందుకు అమెరికా అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో చర్చల భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రస్తుతానికి సస్సెన్స్‌గా మారింది (Iran US negotiations failure).


కాగా, ఈ శాంతి చర్చల నేపథ్యంలో పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు (Pakistan mediation US Iran). ప్రధాన రహదారులను మూసివేశారు. కాగా, ఇరాన్-అమెరికా మధ్య నేరుగా చర్చలు జరగకపోయినా, పాకిస్థాన్ ద్వారా పరోక్షంగా చర్చలు కొనసాగే అవకాశం కనబడుతోంది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..


నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..

Updated Date - Apr 25 , 2026 | 09:43 PM