Share News

2028 నాటికి 50 శాతం ప్రభుత్వ సేవలు ఏఐ ద్వారానే.. కీలక ప్రణాళిక ప్రకటించిన యూఏఈ..

ABN , Publish Date - Apr 25 , 2026 | 08:15 PM

ప్రపంచంలోనే తొలిసారి ఒక దేశం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ప్రభుత్వ కార్యకలాపాలను, సేవలను అందించడానికి సిద్ధమవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

2028 నాటికి 50 శాతం ప్రభుత్వ సేవలు ఏఐ ద్వారానే.. కీలక ప్రణాళిక ప్రకటించిన యూఏఈ..
AI government UAE 2028

ప్రపంచంలోనే తొలిసారి ఒక దేశం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ప్రభుత్వ కార్యకలాపాలను, సేవలను అందించడానికి సిద్ధమవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2028 నాటికి ప్రభుత్వ కార్యకలాపాల్లో సగం 'ఏజెంటిక్ ఏఐ' ద్వారా నడుస్తాయని యూఏఈ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ వెల్లడించారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో పెద్ద సంచలనం సృష్టిస్తోంది (UAE agentic AI).


ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఏఐ టూల్స్ మనకు సహాయం చేస్తాయి. కానీ ఏజెంటిక్ ఏఐ మాత్రం స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఎవరి పర్యవేక్షణా లేకుండా పనులను నిర్వహిస్తుంది. రియల్ టైమ్‌లో స్పందిస్తుంది. ఏజెంటిక్ ఏఐ అనేది కేవలం ఒక సహాయకుడిలా కాదు.. ఓ సహచరుడిలా పనిచేస్తుంది. అంటే ఓ ఎగ్జిక్యూటివ్ భాగస్వామిలా అన్నమాట. ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలను మెరుగుపరచడానికి, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఏజెంటిక్ ఏఐను యూఏఈ పూర్తి స్థాయిలో వినియోగించనుంది (AI government UAE 2028).


ఏజెంటిక్ ఏఐతో ప్రభుత్వ సేవలు మరింత వేగవంతం అవుతాయి. వీసాలు, అనుమతులు, లైసెన్సులు, జరిమానాలు వంటి సేవలను ఈ ఏజెంటిక్ ఏఐ స్వయంగా ప్రాసెస్ చేయగలదు. దీంతో ఫైల్ క్లియరెన్స్, నిర్ణయాల ప్రక్రియలో ఆలస్యం తగ్గుతుంది. అంతే కాకుండా, ప్రభుత్వ ఖర్చులు తగ్గడం, పనితీరు మెరుగుపడడం కూడా ఏజెంటిక్ ఏఐతో సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు (UAE technology news).


డేటా విశ్లేషణ, నిర్ణయాలు, అమలు వంటి మూడు దశలను ఏజెంటిక్ ఏఐ ఒకేసారి నిర్వహించగలదు (AI public services). ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోతారనే అందోళనలు వినిపిస్తున్నాయి. అయితే ఉద్యోగాల సంఖ్యను తగ్గించడం తమ లక్ష్యం కాదని, ఏఐతో కలిసి పని చేసే విధంగా ఉద్యోగులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని యఏఈ ప్రధాని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..


నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..

Updated Date - Apr 25 , 2026 | 08:40 PM