Share News

పోటాపోటీగా నీటి విడుదల

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:13 AM

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది.

పోటాపోటీగా నీటి విడుదల

  • కేఆర్‌ఎంబీ అనుమతి లేకుండానే విడుదల చేస్తున్న ఏపీ, తెలంగాణ

  • అర అడుగు తగ్గిన సాగర్‌ నీటిమట్టం

నాగార్జునసాగర్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) అనుమతి లేకుండానే గురువారం ఉదయం కుడి కాల్వకు ఏపీ అధికారులు నీటిని విడుదల చేయగా, గంట వ్యవధిలోనే తెలంగాణ అధికారులు ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. శుక్రవారం కూడా ఇది కొనసాగింది.


దీంతో సాగర్‌ నీటిమట్టం ఒక్క రోజులోనే అర అడుగు (ఒక టీఎంసీ) తగ్గి.. 534 అడుగుల నుంచి 533.50 అడుగులకు పడిపోయింది. సాగర్‌ నుంచి 14,872 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఎగువనుంచి ఎలాంటి వరద రాక లేదు. కాగా, ఉమ్మడి ఏపీ విభజన అనంతరం ఇరు రాష్ట్రాల అధికారులు కేఆర్‌ఎంబీ అనుమతితోనే కాల్వలకు నీటిని విడుదల చేసేవారు. కానీ, ప్రస్తుతం బోర్డు అనుమతులు లేకుండానే పోటాపోటీగా నీటిని విడుదల చేయడంపై నీటి పారుదల రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

Updated Date - Nov 28 , 2026 | 05:14 AM