Share News

కాంట్రాక్టు ఇవ్వకపోతే ప్రతిపక్షం.. ఇస్తే జై రేవంత్‌

ABN , Publish Date - Nov 20 , 2026 | 06:12 AM

కాంట్రాక్టులు ఇవ్వనంతసేపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత పార్టీలోనే ప్రతిపక్షంలా వ్యవహరిస్తారని, ఒక్క కాంట్రాక్టు ఇస్తే.. వెంటనే జై రేవంత్‌రెడ్డి అంటూ డబ్బా కొడతారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి విమర్శించారు.

కాంట్రాక్టు ఇవ్వకపోతే ప్రతిపక్షం.. ఇస్తే జై రేవంత్‌
Jagdish Reddy

  • కోమటిరెడ్డి బ్రదర్స్‌ది పదవుల కోసం బూట్లు నాకే నైజం

  • దమ్ముంటే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలి

  • సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి

గట్టుప్పల, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టులు ఇవ్వనంతసేపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత పార్టీలోనే ప్రతిపక్షంలా వ్యవహరిస్తారని, ఒక్క కాంట్రాక్టు ఇస్తే.. వెంటనే జై రేవంత్‌రెడ్డి అంటూ డబ్బా కొడతారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి విమర్శించారు. ఆల్‌ ఇండియా హ్యాండ్లూమ్‌, వీవర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ డైరెక్టర్‌గా రాష్ట్రం నుంచి ఎన్నికైన కర్నాటి వజ్రమ్మను గురువారం నల్లగొండ జిల్లా గట్టుప్పల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సన్మానించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి పదవి, కాంట్రాక్టులు ఇవ్వలేదనే అక్కసుతోనే సీఎం రేవంత్‌రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దూషిస్తున్నారని అన్నారు. పదవులు, కాంట్రాక్టుల కోసం బూట్లు నాకే నైజం కోమటిరెడ్డి బ్రదర్స్‌ది అని ఎద్దేవా చేశారు. రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు ప్రజలపై నిజంగా ప్రేమ ఉంటే, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడితే.. వెంటనే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయాలన్నారు.


ఇవి కూడా చదవండి...

‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్

నాపై ఆరోపణలు చేసేవారు చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే: వీసీ సజ్జనార్

Read latest Telangana News And Telugu NEws

Updated Date - Nov 20 , 2026 | 06:12 AM